అంగన్‌వాడి సమస్యల పరిష్కారానికి తలసాని హామీ
– టీచర్లకు మొబైల్ ఫోన్ల పంపిణీ
సనత్‌నగర్,(విజయక్రాంతి): అంగన్ వాడి కేంద్రాలలోని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. బుధవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని క్యాంప్ కార్యాలయంలో అమీర్ పేట సనత్ నగర్ డివిజన్ ల పరిధిలోని అంగన్ వాడి టీచర్లకు నూతన మొబైల్ ఫోన్ లను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అందజేశారు. అంగన్ వాడి కేంద్రాల పరిధిలోని గర్భిణులు, బాలింతలు, పిల్లల వివరాలు, వారికి అందిస్తున్న పౌష్టికాహారం తదితర వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేసేందుకు మొబైల్ ఫోన్ లను అంగన్ వాడి టీచర్లకు అందిస్తున్నట్లు
సూపర్ వైజర్ లు లోవ కుమారి, పాతిమా బేగం లు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు వివరించారు. మెరుగైన సేవలు అందించాలని అంగన్ వాడి లను ఆదేశించారు. అంగన్ వాడి కేంద్రాలలో ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి వివరాలు అందజేస్తే పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నామన శేష కుమారి, నాయకులు అశోక్ యాదవ్, ప్రవీణ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, కూతురు నర్సింహ, గోపిలాల్ చౌహాన్, కట్టా బలరాం, లలితా చౌహన్, హరిసింగ్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.




