తాలూకా స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం
చిన్నంబావి, మార్చి14: ఉగాది పండుగ సందర్భంగా తాలూకా స్థాయి కబడ్డీ పోటీలను చిన్నంబావి మండల కేంద్రంలో బుధవారం ప్రారంభించారు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బీరం హ ర్షవర్ధన్ రెడ్డి. వివిధ గ్రామాల నుంచి వచ్చిన క్రీడాకారులతో పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో మానసిక ఉల్లాసం,మానసిక ఉత్తేజం కలు గుతాయన్నారు.పోటీల్లో భాగంగ మొదటి బహుమతి రూ. 30 వేలు,ద్వితీయ బహుమతి రూ.15 వేల రూపాయల నగదు అందజేయనున్నారు.
ప్రతి ఆటలో బెస్ట్ రైడర్,బెస్ట్ క్యాచర్ తోపాటుగా కబడ్డీ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ పీ సోమేశ్వరమ్మ,మాజీ జెడ్పీటీసీ వెంకట్రావమ్మ,మాజీ వైస్ ఎంపీపీ పుస్పలత,శ్రీధర్ రెడ్డి,ఈదన్న యాదవ్,రంజిత్ కుమార్,తగరం నరసింహ,జింకల రమేష్,ప్రకాష్,తగరం కురుమయ్య,జీవీకే నాయుడు తదితరులు పాల్గొన్నారు.




