17 August, 2026 | 10:58 AM

28న తండేల్ ట్రైలర్

26-01-2025 01:06 AM

నాగచైతన్య, సాయిపల్లవి జంట గా నటిస్తున్న చిత్రం ‘తండేల్’. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటివరకు విడుదలైన పాటలన్నింటికీ విశేష స్పందన లభించిం ది. తాజాగా మేకర్స్ ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను జనవరి 28న విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్‌ను విడుదల చేశారు.

ఈ పోస్టర్‌లో నాగచైతన్య అల్యూమినియం బకెట్‌ను ఆయుధంగా పట్టుకొని విలన్స్‌తో తలపడటానికి సిద్ధంగా ఉన్న ఫెరోషిషియస్ అవతారంలో కనిపించారు. లవ్ ఎలిమెంట్స్‌తోపాటు, సినిమాలో మంచి యాక్షన్ కూడా ఉంటుం దని ఈ పోస్టర్ చూస్తే తెలుస్తోంది. ఫిబ్రవరి 7న విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్; డీవోపీ: శ్యామ్‌దత్.