‘మదగజరాజ’ యాక్షన్ కామెడీ
26-01-2025 01:04 AM
విశాల్ హీరోగా నటించిన ‘మదగజరాజ’ చిత్రం సంక్రాంతి సందర్భంగా తమిళంలో విడుదలై, మంచి టాక్ సొంతం చేసుకుంది. సంతానం, వరలక్ష్మి, అంజలి, శరత్ సక్సేనా, సోనూ సూద్, మణివణ్ణన్ (లేట్), నితిన్ సత్య, సడగొప్పన్ రమేశ్, ఆర్ సుందర్ రాజన్ తదితర ముఖ్య తారాగణంతో రూపొందిందీ సినిమా.
సుందర్ సీ దర్శకత్వంలో జెమిని ఫిల్మ్ సర్క్యూట్ నిర్మించిన ఈ యాక్షన్ -కామెడీ మూవీని ఈ సినిమాను తెలుగులో సత్యకృష్ణన్ ప్రొడక్షన్స్ విడుదల చేస్తోంది. జనవరి 31న ఈ సినిమా టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా హీరో వెంకటేశ్‌తో ట్రైలర్‌ను మేకర్స్ లాంచ్ చేయించారు. ట్రైలర్ చూస్తే.. ఈ సినిమా కామెడీ, యాక్షన్‌తో కూడిన వినోదాన్ని పంచనున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ఎం నాథన్; సంగీతం: విజయ్ ఆంటోని.






