15 June, 2026 | 10:14 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

ఎస్‌ఎస్‌ఎంబీ షురూ

26-01-2025 01:09 AM

టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్‌ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్‌బాబు కాంబోలో ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’గా ప్రచారంలో ఉన్న ఈ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటనలేవీ లేకున్నా ఇప్పటికే ప్రపంచ స్థాయిలో ఆసక్తి నెలకొంది. దీనికి గురించి ఏ చిన్న వార్త వచ్చినా క్షణాల్లో వైరల్ అయిపోతోంది. చడీ చప్పుడు లేకుండా పూజా కార్యక్రమాలు కానిచ్చేసిన ఈ చిత్రం నుంచి సాలిడ్ అప్‌డేట్‌ను పంచుకున్నారు దర్శకుడు రాజమౌళి.

షూటింగ్ ప్రారంభమైందన్న విషయాన్ని తెలియజేస్తూ.. ఒక వీడియోను సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల చేశారు. ఈ వీడియోలో సింహం బోనులో బంధించి ఉన్నట్టున్న ఓ చిత్రం వద్ద దర్శక ధీరుడు నిల్చోని ఓ పాస్‌పోర్టును చూపిస్తూ కనిపించారు. ఈ వీడియోకు ‘క్యాప్చర్’ అనే క్యాప్షన్ పెట్టారు. ఇటీవల మహేశ్‌బాబు ‘ముఫాసా: ది లయన్ కింగ్’ చిత్రంలోని సింహం పాత్రకు వాయిస్ ఓవర్ ఇచ్చారు..

అంటే మహేశ్‌ను సింహంతో పోల్చుతూ ఆయన పాస్‌పోర్టును లాక్కొని, ఆయన్ను తన ఆధీనంలోకి తీసుకున్నాను’ అనే అర్థం వచ్చేలా ఈ వీడియోను రూపొందించినట్టు తెలుస్తోంది.

ఈ వీడియోతో తాజాగా ఈ మూవీ పట్టాలెక్కబోతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమాలో తాను భాగమైన విషయాన్ని ప్రియాంక చోప్రా తన రిప్లు పోస్ట్‌తో ఖరారు చేసింది. ఈ వీడియో పోస్ట్‌పై మహేశ్ స్పందిస్తూ ‘ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను..’ అన్న పోకిరి సినిమాలోని డైలాగ్‌ను కామెంట్ చేశారు. రాజమౌళి పోస్ట్ నేపథ్యంలో సోషల్ మీడియా సరదా మీమ్స్‌తో నిండిపోయింది.