22 May, 2026 | 6:07 PM

పెద్ద కాపర్తిలో టీబీ నిర్ధారణ హెల్త్ క్యాంపు

22-05-2026 05:34 PM

100 మందికి పరీక్షలు.. నలుగురిలో టీబీ లక్షణాల గుర్తింపు

చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల మండలం పెద్ద కాపర్తి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో టీబీ వ్యాధిగ్రస్తులను గుర్తించే ప్రత్యేక హెల్త్ క్యాంపును గ్రామ సర్పంచ్ కాటం వెంకటేశం శుక్రవారం ప్రారంభించారు. ప్రభుత్వం పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఆధునిక సాంకేతికత కలిగిన మొబైల్ పరీక్షా యంత్రాలను గ్రామాలకే పంపిస్తున్న నేపథ్యంలో ఈ ప్రత్యేక పరీక్షా వాహనం పెద్ద కాపర్తి గ్రామానికి చేరుకోవడం ఆనందకరమని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా సర్పంచ్ కాటం వెంకటేశం మాట్లాడుతూ నకిరేకల్ శాసనసభ్యుడు , ప్రభుత్వ విప్  వేముల వీరేశం సహకారంతో ఈ హెల్త్ క్యాంపు గ్రామానికి వచ్చినట్లు తెలిపారు. గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ఈ క్యాంపులో మొత్తం 100 మందికి టీబీ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, నలుగురిలో టీబీ లక్షణాలను వైద్య సిబ్బంది గుర్తించారు. వారికి తదుపరి వైద్య చికిత్సలు అందించే చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బొంగుచెరువు సర్పంచ్ కట్ట ఆశయ, ఉపసర్పంచ్ ఓర్సు సైదులు, హెల్త్ డిపార్ట్మెంట్ హెల్త్ అసిస్టెంట్ చిత్తలూరు శ్రీను, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.