30 March, 2026 | 2:17 AM

ఘనంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు

30-03-2026 12:45 AM

మంగపేట, మార్చి 29 (విజయక్రాంతి): తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం మంగపేట మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురష్కరించుకుని ఆదివారం ఉదయం మండల కేంద్రంలోని గంపోనిగూడెం క్రాసు రోడ్డు వద్ద తెలుగుదేశం పార్టీ కార్యాలయ స్థలం, కమలాపురం, రాజుపేట గ్రా మాలలో ఉన్న తెలుగుదేశం పార్టీ జెండా గద్దెల వద్ద టిడిపి నాయకులు, శ్రేణులు టీడీపీ జెండాను ఎగురవేసి వేశారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం అధినాయకత్వం ఆదేశాల మేరకు నేడు పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు వెల్లడించారు.

తెలుగు రాష్ట్రంలో పేద ప్రజలకు సంక్షేమ పథకాలను అందించి పేదల పక్షాన పోరాడిన మొట్టమొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని అ న్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయాలకు అనుగుణంగా ఆ పార్టీని ముం దుకు తీసుకు వెళుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు భవనం శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర నాయకులు లెక్కల వేణుగోపాల్ నాయుడు, నాయకులు మ న్నెం నాగేశ్వరరావు, పోతుమర్తి రమేష్, ఎం.భాష్కర్ రెడ్డి, నందిగాం కృష్ణ, మలినేని వెంకటేశ్వరరావు, కోరుకోప్పుల శంకర్, నర్రా సురేష్, పాలెం తిరుపతి, కొప్పాక హన్మంతరావు, గుంటూరు ఉదయ్, రాఘవాచారి తదితరులతో పాటు మండలంలోని పలు గ్రామాలకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ , ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.