30 March, 2026 | 2:18 AM

ములుగు జిల్లాలో ఉల్లాస్ పరీక్షల నిర్వహణ

30-03-2026 12:47 AM

ములుగు టౌన్ , మార్చి 29 (విజయక్రాంతి): నిరక్షరాస్యులను అక్షరాసులుగా తీర్చిదిద్దడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో చేపట్టిన ‘ఉల్లాస్’ కార్యక్రమంలో భాగంగా ములుగు జిల్లాలో ఆదివారం వ యోజనులకు మూడవ తరగతి స్థాయిలో పరీక్ష నిర్వహించారు. 2022-2027 వరకు ఐదు సంవత్సరాల పాటు అమలు చేస్తున్న ఈ కార్యక్రమంలో 15 సంవత్సరాల పైబడి ఉన్న నిరక్షరాస్యులకు అక్షర జ్ఞానం కల్పించడం, వారిని సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చేయడం లక్ష్యం. నిరక్షరాస్యులకు చదవడం, రాయడం నేర్పించడం, ఆర్థిక, డిజిటల్ అక్షరాస్యత కల్పించడం, స్వయం సహాయక సంఘాల మహిళలకు సామాజిక, ఆర్థిక అభివృద్ధికి సహాయం చేయడం, వయోజన విద్యాభ్యాసం కల్పించడం జరుగుతోంది.

జిల్లా, మండల, స్కూల్ స్థాయిలో ప్రోగ్రామ్ అమలు, డి ఆర్ డి ఏ, డీఈఓ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీగా వ్యవహరిస్తారు. స్వచ్ఛంద సేవకుల ద్వారా బోధన నిర్వహించి పరీక్షలు రాయిస్తారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆదివారం జిల్లాలో 10 మండలాల పరిధిలో 182 ప్రదేశాల్లో, గతంలో నమోదు చేసుకున్న 8,150 నిరక్షరాస్యుల నుండి 3,924 మందికి 3 వ తరగతి స్థాయిలో పరీక్ష రాయడం జరిగింది. అదనపు కలెక్టర్ సంపత్ రావు పర్యవేక్షణలో జిల్లాలో జరిగిన పరీక్షల నిర్వహణలో డి ఆర్ డి ఓ శ్రీనివాస్ రావు , అడిషనల్ డిఆర్డిఓ గొట్టె శ్రీనివాస్, జిల్లా విద్యాధికారి సిధార్థ రెడ్డి , జిల్లా ఉల్లాస్ నోడల్ అధికారి కృష్ణ బాబు, అడల్ట్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ అధికారి వేణుగోపాల్, ఎంఈఓ లు, డీపిఎం లు, ఏపీఎంలు, సీసీలు, వివోఏలు, జిల్లా సమాఖ్య అధ్యక్షులు పద్మ, సర్పంచ్ లు పాల్గొన్నారు.