5 August, 2026 | 6:34 PM

గిచ్చుతూ... గిల్లుతూ

23-08-2024 03:08 PM

విద్యార్థినీల పట్ల ఉపాధ్యాయుడు అసభ్య ప్రవర్తన 

పోలీసుల అదుపులో ఉపాధ్యాయుడు 

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినీలను గిచ్చుతూ గిల్లుతూ, ఒళ్లంతా నిమురుతు అసభ్య ప్రవర్తనకు పాల్పడ్డాడు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే వారి పట్ల వికృతంగా వ్యవహరించిన వైనం శుక్రవారం వెలుగు చూసింది. కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ కూడలిలో గల సింగరేణి బాలికల ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న వేణు చిన్నారుల శారీరకంగా హింసిస్తున్నట్లు తెలిసింది. ఉన్నట్లుండి శుక్రవారం విద్యార్థులు కొందరు పాఠశాలకు వెళ్ళమని, పాఠశాలలో టీచర్ శారీరకంగా తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు పాఠశాల వద్ద వచ్చి ఆ ఉపాధ్యాయుని తమకు అప్పగించాలంటూ ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న వన్ టౌన్ ఎస్సై పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయుని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.