ఓపెన్ కోర్సుల పోస్టర్ ఆవిష్కరణ
కుమ్రంభీం ఆసిఫాబాద్( విజయ క్రాంతి): జిల్లా కేంద్రంలోని జెడ్పి బాలికల పాఠశాలలో శుక్రవారం తెలంగాణ సార్వత్రిక విద్యా పీఠం లో 10 వ తరగతి, ఇంటర్మీడియట్ ప్రవేశానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టాస్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ అశోక్ మాట్లాడుతూ.. చదువుకోవలసిన వయసులో వ్యక్తిగత కారణాలవల్ల, ఇతర కారణాల వల్ల చదువుకొని వారు ఓపెన్ విధానం ద్వారా పదవ తరగతి, ఇంటర్మీడియట్ యందు ప్రవేశించి పూర్తి చేయుటకు తెలంగాణ సార్వత్రిక విద్యా పీఠం ఒక చక్కని అవకాశాన్ని కల్పించిందన్నారు. ఈ నెల 31 లోగా 14 సంవత్సరాలు నిండినవారు ఎలాంటి విద్యార్హతలు లేకున్నా, చదవడం రాయడం వచ్చినటువంటి వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. సెంటర్ కోఆర్డినేటర్ సుభాష్ బాబు మాట్లాడుతూ... సెప్టెంబర్ 10 వ తేదీ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో సంప్రదించి దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా సూచించారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కోఆర్డినేటర్ హేమంత్ షిండే తదితరులు పాల్గొన్నారు.






