calender_icon.png 14 February, 2026 | 2:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారిశుద్ధ్యంపై టెక్నాలజీ నిఘా

14-02-2026 12:22:37 AM

  1. విధుల్లో అలసత్వం వహిస్తే వేటే 
  2. వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్
  3. సిబ్బందికి బయోమెట్రిక్ హాజరు 
  4. ఉన్నతాధికారులతో ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి సమీక్ష 

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎంఎంసీ పరిధిలో పారిశుధ్య నిర్వహణను మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు కమిషనర్ టి.వినయ్ కృష్ణారెడ్డి చర్యలు తీసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో పారిశుధ్య పనుల తీరును మెరుగుపరచడం తో పాటు, ఆధునిక సాంకేతికతను జో డించి నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆయ న అధికారులను ఆదేశించారు.

శుక్రవారం కార్పొరేషన్ కార్యాలయంలో అడిషనల్ క మిషనర్, జాయింట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్లు, ఇంజనీరింగ్ అధికారులతో కలి సి శానిటేషన్, ఎంటమాలజీ విభాగాలపై ఆయన సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో వంద శాతం ఇంటింటి చెత్త సేకరణ లక్ష్యంగా పనిచేయాలని స్పష్టం చేశారు. ప్రతి గల్లీలోకి స్వచ్ఛ ఆటోలు నిర్ణీత సమయానికి వెళ్లేలా చూడాలన్నారు.

తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడంపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ఎక్కడా చెత్త కుప్పలు పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని ఆదేశించారు. పారిశుధ్య వాహనాల కద లికలను పర్యవేక్షించేందుకు వెహికల్ ట్రాకిం గ్ సిస్టమ్‌ను పక్కాగా అమలు చేయాలని కమిషనర్ సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే డ్రైవర్లు, సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 

క్షేత్రస్థాయి సిబ్బం ది హాజరు కోసం బయోమెట్రిక్ లేదా ఆధునిక అటెండెన్స్ మానిటరింగ్ సిస్టమ్‌ను పటిష్ఠం చేయాలని ఆదేశించారు. దోమల నివారణకు ఎంటమాలజీ విభాగం సమర్థవంతంగా పనిచేయాలని కమిషనర్ సూచిం చారు. నగరంలో డెంగ్యూ, మలేరియా వం టి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా యాం టీ లార్వా చర్యలను ముమ్మరం చేయాలన్నారు.

దోమల ఉత్పత్తి కేంద్రాలను గుర్తించి ఫాగింగ్, స్ప్రేయింగ్ పనులు నిరంతరం కొనసాగించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.మల్కాజిగిరిని పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దేందుకు అధికారులు, సిబ్బం ది సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చా రు. సమావేశంలో అదనపు కమిషనర్ శానిటేషన్ సీఎన్ రఘుప్రసాద్, జాయింట్ కమి షనర్ మోహన్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్లు, డీఈఈలు, ఏఈలు, రాంకీ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.