12 April, 2026 | 2:05 AM

అటెండర్ మృతికి తహసీల్దార్ సంతాపం

11-02-2026 07:17 PM

మోతే,(విజయక్రాంతి): మోతె మండల తహసీల్దార్ కార్యాలయంలో అటెండర్ గా విధులు నిర్వహిస్తున్న కాంపాటి సాయిలు మంగళవారం రాత్రి ఆకస్మికంగా మృతి చెందడం తో బుధవారం తహసీల్దార్ యం.వెంకన్న మృతుని గ్రామం సిరిపురం వెళ్ళి సాయిలు పార్దివదేహానికి పూలమాలలు వేసి నివాళ్ళు అర్పించారు. అనంతరం సాయిలు  కుటుంబ సభ్యులకు ప్రగడ సంతాపాన్ని తెలియజేశారు. సాయిలు ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరారు. ఈ కార్యక్రమం లో డిటి పుష్ప, సీనియర్ అసిస్టెంట్ సుజిత్, జిపిఓలు రమేష్, జహంగీర్, సుధాకర్, నాగయ్య, తాసిల్దార్ కార్యాలయం స్టాప్   పాల్గొన్నారు.