calender_icon.png 10 May, 2025 | 8:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటర్‌లో తేజస్ అద్భుత ఫలితాలు

24-04-2025 01:33:37 AM

కరీంనగర్ క్రైమ్, ఏప్రిల్ 23 (విజయ క్రాంతి): ఇంటర్మీడియట్ ఫలితాల్లో  కరింనగర్ సమీపంలోని కొత్తపల్లి లో గల తేజస్  జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించారు.

ఈ సందర్భంగా అకాడమీ చైర్మన్ సిహెచ్ సతీష్ రావు మాట్లాడుతూ ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ విభాగంలో ఏ శ్రీదేవి 466(కరీంనగర్), బి రితిష్ యాదవ్ 466(మంచిర్యాల), ఎం వర్షిత్ 365(హనుమకొండ), ఏ నందీశ్వర్ 464(సంగారెడ్డి), విటల్ 462 (సంగారెడ్డి),  సీఈసీ విభాగంలో బి రామ్ చరణ్ 490(సిద్దిపేట), జి రాజేందర్ 483 (మహబూబాబాద్) మార్కులు సాధించారని తెలిపారు. ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీలో  ఎస్ మారుతి 993(రాజన్న సిరిసిల్ల), బైపీసీలో ఏ పరశురాములు 969(సిద్దిపేట), సీఈసీ విభాగంలో ఎం మనోజ్ కుమార్ 929(నిర్మల్) మార్కులు సాధించాలని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు.