calender_icon.png 11 May, 2025 | 2:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి

24-04-2025 01:32:49 AM

సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు

చిలుకూరు,ఏప్రిల్ 23 :   ఐకెపి సెంటర్లలో ప్రభుత్వ మార్కెట్లలో ధాన్యం కొనుగోలు వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, సిపిఐ,సూర్యాపేట జిల్లా కార్యదర్శి బెదవాడ వెంకటేశ్వర్లు, అధికారులను డిమాండ్ చేశారు. బుధవారం, చిలుకూరు మండలం సీతారాంపురం గ్రామంలో సిపిఐ, గ్రామ శాఖ మహాసభలో గన్నా వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సమావేశానికి,

సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడుతూ, ధాన్యం ఐకెపి కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వ మార్కెట్లో పెద్ద ఎత్తున ధాన్యం రాసులు పోసుకొని ఎదురుచూస్తున్నప్పటికి అధికారులు మ్యాచర్ పేరుతో గోనెసంచుల కొరతతో లోడింగ్ సరిగా జరగకపోవటం వల్ల రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అకాల వర్షాలతో ధాన్యం తడిసి నష్టపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రతి ఏటా అధికారులు ముందు జాగ్రత్త లేనందువల్ల ఈ రకమైన సమస్యలు ఏర్పడుతున్నాయని ప్రభుత్వ పెద్దలుముందు జాగ్రత్తతో అధికారులకు సరైన ఆదేశాలు ఇచ్చి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదని తక్షణం ధాన్యం కొనుగోలు జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం సీతారాంపురం గ్రామ నూతన కమిటీని తొమ్మిది మందితో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ప్రధాన కార్యదర్శిగా కనకం రుద్రయ్య, సహాయ కార్యదర్శిగా పుట్టపాక రవి,కమిటీ సభ్యులుగా  బాల బోయినగురవయ్య, సాతులూరి అలివేలు, గన్న వెంకటేశ్వర్లు, పిల్లుట్ల చంద్రయ్య, తోడేటి కోటయ్య,పార్వతమ్మ లను, ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి మండవ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.