2 August, 2026 | 2:30 AM

జిల్లా అథ్లెటిక్స్ పోటీల్లో ‘తేజస్’ సత్తా

02-08-2026 12:16 AM

ప్రతిభ చాటిన జూనియర్ కళాశాల విద్యార్థులు

కరీంనగర్, ఆగస్టు 1(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రీజినల్ స్పోర్ట్స్ స్కూల్, కరీంనగర్ వేదికగా నిర్వహించిన జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో తేజస్ జూనియర్ కళాశాల, కొత్తపల్లి, కరీంనగర్ విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి పలు విభాగాలలో పతకాలు సాధించి కళాశాలకు కీర్తి ప్రతిష్ఠలు తీసుకువచ్చారు.

అండర్18 జావెలిన్ త్రో పోటీల్లో సీహెచ్ భీమేష్ ప్రథమ స్థానం (41.25 మీటర్ల రికార్డు), 100 మీటర్ల పరుగు పందెంలో జి. రేవంత్ ప్రథమ స్థానం, 200 మీటర్ల పరుగు పందెంలో సీహెచ్  అభిషేక్ తృతీయ స్థానం, వెయ్యి మీటర్ల పరుగు పందెంలో బి. సిద్దు తృతీయ స్థానం, షాట్‌పుట్‌లో బి. నాగరాజు ప్రథమ, జె. సాయికృష్ణ ద్వితీయ స్థానాలు, డిస్కస్ త్రో బి. నాగరాజు ద్వితీయ, జె. సాయి కృష్ణ తృతీయ స్థానాల్లో వచ్చారు. వీరంతా ఆగస్టు 7న హనుమకొండలో జరిగే రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు కరీంనగర్ జిల్లా తరఫున ఎంపికయ్యారు.

ఈ సందర్భంగా తేజస్ జూనియర్ కళాశాల చైర్మన్ సీహెచ్ సతీష్ రావు విద్యార్థులను, వారికి శిక్షణ అందించిన పీఈటీలు, అధ్యాపక బృందాన్ని హృదయపూర్వకంగా అభినందించారు. అలాగే తేజస్ జూనియర్ కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్, అధ్యాపకులు, సిబ్బంది విజేతలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర స్థాయి పోటీలలో విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు.