2 August, 2026 | 6:43 PM

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

24-07-2024 10:12 AM

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకి జరిగిన అన్యాయంపై సభలో సర్కార్ తీర్మానం చేయనుంది. అసెంబ్లీలో హైదరాబాద్ అభివృద్ధిపై స్వల్పకాలిక చర్చించనున్నారు. రైతు రుణమాఫీపై చర్చను ప్రభుత్వం వాయిదా వేసుకుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గురువారం సభలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు.