15 July, 2026 | 4:46 AM

తెలంగాణ అభివృద్ధికి సహకరించమని ప్రధానిని కోరాం

04-07-2024 04:47 PM

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించమని ప్రధాని మోడీని కోరామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రానికి సంబంధించిన నిధులు, ఇతర అంశాలపై వినతి పత్రాలు ఇచ్చామన్నారు. తెలంగాణ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని చెప్పిన ముఖ్యమంత్రి పరిష్కారంపై కేంద్రం సానుకూలంగా స్పందించిందని సీఎం తెలిపారు.