27 July, 2026 | 12:05 PM

Breaking News

లిఫ్ట్ మోటార్ల తో నీటిని రిజర్వాయర్ లోకి ఎత్తాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్   •   సులానగర్ పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   సిరిసిల్ల జిల్లా గౌడ యువజన సంఘం అధ్యక్షుడిగా సందీప్ గౌడ్.   •   జలపాతాల అందాలను పర్యాటకులు ఆస్వాదించేలా ఏర్పాటు చేయండి   •   బావుసాయిపేట ఇసుక క్వారీ వద్ద రైతుల ఆందోళన   •   దూడను తిన్న చిరుత పులి   •   సోనాల పాఠశాల విద్యార్థులకు శుద్ధ జలం   •   సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై అంజయ్య   •   సనాతన ధర్మ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: చాగంటి కోటేశ్వర రావు   •   మోదీ హామీ ఏమైంది? విద్యార్థులపై కేసులు ఎత్తివేయలేదు   •  

గవర్నర్‌ను కలిసిన తెలంగాణ ఆహార కమిషన్ చైర్మన్ గోలి

08-04-2026 12:24 AM

రంగారెడ్డి, ఏప్రిల్ 7 (విజయక్రాంతి ): రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, కమిషన్ సభ్యులు ఆనంద్ మరియు భారతితో కలిసి గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలోని ఆహార భద్రత మరియు ప్రజా పంపిణీ వ్యవస్థ (PౄS)పై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో అర్హులైన లబ్ధిదారులందరికీ నాణ్యమైన బియ్యం మరియు నిత్యావసర వస్తువులు సకాలంలో అందేలా తీసుకుంటున్న చర్యలను చైర్మన్ గవర్నర్కు వివరించారు. 

రేషన్ దుకాణాల్లో అవినీతిని అరికట్టడానికి డిజిటల్ సాంకేతికతను వినియోగిస్తున్నామని, దీని ద్వారా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మారుస్తున్నామని తెలిపారు.గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించడంలో కమిషన్ పోషిస్తున్న పాత్రను సభ్యులు వివరించారు.

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆహార భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని కమిషన్ చేస్తున్న కృషి అభినందనీయం. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, గవర్నర్ పేర్కొన్నారు.రాష్ట్రంలో ఆహార సరఫరా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని, అధికారులందరూ అంకితభావంతో పనిచేయాలని గవర్నర్ ఈ సందర్భంగా సూచించారు.