2 June, 2026 | 6:29 PM

Breaking News

భట్టి విక్రమార్క క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో విశేష సేవలు అందించిన లైన్‌మ్యాన్ దేవ్ సింగ్ కు ఉత్తమ ఉద్యోగి అవార్డు   •   మండల వ్యాప్తంగా ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు   •   గుంజపడుగు గ్రామంలో వ్యర్థాలపై ప్రజలకు సర్పంచ్ అవగాహన   •   ఘనంగా అవతరణ వేడుక   •   పలు గ్రామాల్లో పీసీసీ కేంద్రాలను సందర్శించిన డిసిఎస్ఓ వెంకటేశ్వర్లు   •   పట్టపగలే యదేచ్చగా మొరం తవ్వకాలు.. చోద్యం చూస్తున్న అధికారులు   •   అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు   •   కాగజ్‌నగర్ సభలో ఎమ్మెల్యేకు ప్రోటోకాల్ అంశంపై బీఆర్ఎస్ ఆరోపణలు   •   పరిపాలన చేతకాక సీఎం బూతు మాటలు మాట్లాడుతున్నారు: ఎమ్మెల్యే తలసాని   •  

విద్యార్థుల ప్రాణ త్యాగాలు.. కెసిఆర్ దీక్షతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు

02-06-2026 05:45 PM

బోథ్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు బలిదానాలు 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిరాహార దీక్ష ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యమైందని బోత్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ పేర్కొన్నారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వెనుక తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రాణత్యాగం ఉందన్నారు. వేలాదిమంది ప్రజలు ఉద్యమంలో పాల్గొని పార్టీలకు అతీతంగా పోరాటం చేసి తెలంగాణ సాధించుకోవడం జరిగిందన్నారు. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన బిడ్డ లాగా తెలంగాణ రాష్ట్రాన్ని పాలించారన్నారు అభివృద్ధిలో అన్ని రంగాల్లో ముందు ఉంచుతూ రైతు సాగునీరు సంక్షేమం విద్యుత్ మౌలిక సదుపాయాల కల్పనలో ఆయన దేశానికి రోల్ మోడల్ గా నిలిచారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం తెలంగాణ తల్లి రూపాన్ని మార్చి రైతులను మోసం చేస్తూ సస్యశ్యామలమైన తెలంగాణను 50 సంవత్సరాలు వెనక్కి పంపారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాట్లు అవతరణ దినోత్సవంగా జరుపుకోవడం గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు.