పెద్దకాపర్తిలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
చిట్యాల,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మంగళవారం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ కాటం వెంకటేశం జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక మంది చేసిన త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు కృషి చేస్తోందని పేర్కొన్నారు. విద్య, గృహ నిర్మాణం, ఆహార భద్రత తదితర రంగాల్లో చేపడుతున్న కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఓర్సు సైదులు, పంచాయతీ కార్యదర్శి ఆర్. కృష్ణయ్య, వార్డు సభ్యులు కూరు యాదయ్య, తెల్సూరి నరసింహ, జల ప్రశాంత్, నీలకంఠం లింగస్వామి, సాగర్ల నాగరాజు, ఏర్పుల వెంకన్న, గణేష్ చేకూరి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.






