calender_icon.png 9 June, 2025 | 5:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కౌశిక్ రెడ్డికి చుక్కెదురు.. ఆ కేసు కొట్టేసేందుకు హైకోర్టు నిరాకరణ

09-06-2025 12:11:36 PM

హైదరాబాద్: బీఆర్ఎస్ హుజూరాబాద్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై(Kaushik Reddy) నమోదైన కేసును కొట్టివేసేందుకు తెలంగాణ హైకోర్టు(Telangana High Court ) సోమవారం నిరాకరించింది. కమలాపురం పోలీస్ స్టేషన్(Kamalapuram Police Station) లో నమోదైన కేసును కొట్టేయాలంటూ కౌశిక్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ పై నేడు విచారణ చేపట్టిన కోర్టు పోలీసులు నమోదు చేసిన సెక్షన్లలో విచారణ ఎదుర్కోవాల్సిందేనని కౌశిక్ రెడ్డిని ఆదేశించింది.

తనను ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపించకుంటే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని కౌశిక్ రెడ్డి బెదిరింపులకు గురిచేశాడు. 2023 ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యలు చేసినట్లు నోడల్ అధికారి ఫిర్యాదులో పేర్కొన్నారు. కౌశిక్ రెడ్డి(BRS MLA Kaushik Reddy) వ్యాఖ్యలపై నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో కేసు పెండింగ్ లో ఉంది. కమలాపురం పోలీసులు ఇప్పటికే అభియోగ పత్రం దాఖలు చేశారు. 188 సెక్షన్ కొట్టేసి, మిగతా సెక్షన్ల కింద కౌశిక్ రెడ్డి విచారణ ఎదుర్కోవాల్సిందేనని పోలీసులు చెప్పారు.