09-06-2025 04:04:43 PM
మాచన రఘునందన్.. యాన్ అమేజింగ్ ఇండియన్
కేశవరం గళంకు అంతర్జాతీయ గుర్తింపు
మేడ్చల్ జిల్లా కేశవరం ఓ అరుదైన ఘనత దక్కించుకుంది. ఈ గ్రామంకు చెందిన మాచన రఘునందన్ తన అసామాన్య కృషి తో.. అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. పొగాకు నియంత్రణలో అసాధారణ కృషి చేస్తున్న మాచన రఘునందన్ కారణజన్ముడని అంతర్జాతీయ వైద్య విజ్ఞాన పత్రిక సైన్టెక్నాల్ శ్లాఘించింది. ఈ విషయాన్ని సైన్ టెక్ (scintech) గూగుల్ ద్వారా..వెల్లడించింది.ప్రపంచ దేశాల్లో ఉన్న వైద్యుల పరిశోధనలను ప్రచురించే పల్మనరీ మెడిసిన్ పత్రిక మే 31 న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా.. పొగాకు నియంత్రణ కు కృషి చేస్తున్న వారి గురించి వివరాలు సేకరించింది. అలాగే కేన్సర్,క్యాన్సర్ చికిత్స కోసం కృషి చేస్తున్న వైద్యుల పరిశోధనలను ప్రచురిస్తోంది.
ఈ కోవలోనే పల్మనరీ మెడిసిన్ పత్రిక ప్రచురించిన...
"మాచన రఘునందన్ ద టుబాకో కంట్రోల్ మిషన్" అనే అంశంపై సైన్టెక్ (scintech) సమీక్ష చేసింది. సమాజ హితం కోరుతూ ఒక వ్యక్తి పొగాకు నియంత్రణ కోసం ఓ సైనికుడుగా మారాడని ప్రస్తుతించింది. 20 ఏళ్లలో పొగాకు నియంత్రణకు అలుపెరుగని, నిర్విరామ కృషి చేసిన మాచన రఘునందన్ సమాజ చికిత్స చేస్తున్న వైనం.. అద్వితీయం, అమోఘం అని సైన్టెక్ కొనియాడింది. రఘునందన్ కృషిని ప్రపంచ వ్యాప్తంగా అందరూ తెలుసుకోవాలని గూగుల్ లో సైతం పొందుపరచింది. ఇలా ఓ సామాన్యుడి అసామాన్య కృషిని గూగుల్ వేదికగా జన బాహుళ్యానికి చేరేలా ఉంచడం ఓ తెలుగు వ్యక్తి గా..రఘునందన్ అరుదైన ఘనత దక్కించుకున్నారు.
ఎన్నో విమర్శలు...
"ఏం నీ కేం పని పాట లేదా.. దారిన పోయే వాళ్ళను పట్టుకుని బి డి తాగకు,సిగరెట్ మానెయ్ సార్..అని చెప్తావుంటావ్" అని ఇంట్లో ఎంతగా..ఎన్నో మార్లు.. అయిన వాళ్ళే మందలించినా.. సమాజ హితం కోరుతూ రఘునందన్ చేసిన పోరాటం ఇపుడు అంతర్జాతీయ స్థాయిలో అవార్డులను, ప్రశంస లను తెచ్చి పెడుతోంది.