10 April, 2026 | 7:32 PM

Breaking News

రుద్రారం శివారులో అక్రమ ఇసుక టిప్పర్ సీజ్... ఒకరి అరెస్ట్   •   రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తాం   •   దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రెండవ రాష్ట్ర మహాసభలు   •   మంత్రి పొంగులేటిని మర్యాదపూర్వకంగా కలిసిన హాఫీజుద్దీన్   •   ప్రతి గడపకూ సంక్షేమ కాంతి.. ప్రతి రైతుకూ ప్రభుత్వ భరోసా : మంత్రి పొంగులేటి   •   నిఘా నేత్రల ఏర్పాటులో భాగస్వామ్యులు కావాలి   •   గబ్బిలాల పేటలో ప్రభుత్వ పాఠశాల సాధించే వరకు పోరాటం ఆగదు   •   షార్ట్ సర్క్యూట్‌తో వీదినపడ్డ నిరుపేద కుటుంబం   •   క్యాంటీన్‌లో మిల్లెట్స్ వంటకాలు అందుబాటులోకి తేవాలి   •   ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ ను అభినందించిన ఎమ్మెల్యే   •  

మోహన్ బాబుకు హైకోర్టులో చుక్కెదురు

13-12-2024 07:52 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. మీడియా ప్రతినిధిపై దాడి ఘటనలో మోహన్ బాబు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై శుక్రవారం విచారణ జరిపి ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు తిరస్కరించింది. జల్ పల్లిలోని తన ఇంటి వద్ద జర్నలిస్టుపై జరిగిన దాడి ఘటనపై పహడీషరీఫ్ పీఎస్ లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఆయనను అరెస్టు చేయకుండా మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని మోహన్ బాబు హైకోర్టును ఆదేశించారు. కాని, మోహన్ బాబు అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. దీంతో మోహన్ బాబు కేసుపై హైకోర్టు కౌంటర్ దాఖలు చేయలని పోలీసులకు ఆదేశించింది. ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది.