10 April, 2026 | 5:44 PM

Breaking News

జిల్లాలో ‘అరైవ్–అలైవ్’ కార్యక్రమం పకడ్భందిగా నిర్వహించాలి   •   బంధాన్ని... బాధ్యతను మరచిన ఓ తల్లి   •   తంగళ్ళపల్లిలో ఘనంగా ప్రారంభమైన కేసీఆర్ క్రికెట్ కప్ 2026 క్రీడా పోటీలు   •   రాష్ట్ర కో కన్వీనర్ గా బద్రి శీను   •   ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి   •   గల్ఫ్ బాధితుల కోసం అడ్వైజరీ కమిటీ ఏర్పాటు   •   సంపూర్ణ ఆరోగ్యం యోగతోనే సాధ్యం - జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి   •   చేనేత కార్మికుల ఆత్మగౌరవానికి అండగా నిలుస్తాం   •   శ్రీ భక్తంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు   •   రాజ్యసభ సభ్యుడిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం   •  

అల్లు అర్జున్ అరెస్టును ఖండించిన హరీశ్ రావు

13-12-2024 07:26 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్టు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మరింది. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన కేసులో బన్ని చిక్కడిపల్లి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. బన్ని అరెస్టును పలువురు సినీ, రాజకీయ నాయుకులు ఖండిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. జాతీయ అవార్డు విజేత అల్లు అర్జున్ అరెస్టును బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు ఖండించారు. అసలు బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది ఎవరు..?, ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా సినిమా ప్రదర్శించింది ఎవరు? అని ప్రశ్నించారు.

సినిమా కోసం వెళ్లి తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరామన్నారు. దీనికి అసలు కారకులు, రాష్ట్ర పాలకులే రాష్ట్ర పాలకులే, చర్యలు తీసుకోవలసింది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పైనే అని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడి వేధింపుల వల్లే చనిపోతున్నా అని కొండారెడ్డిపల్లి గ్రామ మాజీ సర్పంచ్ సాయి రెడ్డి సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకుంటే సీఎం బ్రదర్స్ ని ఎందుకు అరెస్టులు చేయరు?, మేడ్చల్ వ్యవసాయ కార్యాలయం వద్ద సురేందర్ రెడ్డి అనే రైతు రేషన్ కార్డు నిబంధనల వల్ల, రుణమాఫీ కాక ఆత్మహత్య చేసుకుంటున్నా అని సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకుంటే కారకుడైన రేవంత్ రెడ్డిని ఎందుకు అరెస్టు చేయరు? హరీశ్ రావు అడిగారు.

అరెస్టు చేయాల్సి వస్తే ముందు రేవంత్ రెడ్డి సోదరులను అరెస్టు చేయాలన్నారు. ఏడాది పాలనలో రైతులను బలిగొన్నందుకు ఎవరిని అరెస్టు చేయాలి?, ఫుడ్ పాయిజన్లతో 49 మంది విద్యార్థులు  చనిపోయారు. దీనికి ఎవరిని అరెస్టు చేయాలి?, ఫార్మా సిటీ పేరుతో లగచర్ల గిరిజన బతుకులను ఛిద్రం చేశారు. దీనికి ఎవరిని అరెస్టు చేయాలి? అని మండిపడ్డారు. చట్టం అల్లు అర్జున్ విషయంలోనే కాదు సీఎం రేవంత్ రెడ్డి అండ్ బ్రదర్స్ విషయంలోనూ స్పందించాలని, చట్టం ఎవ్వరికీ చుట్టం కాకూడదని హరీశ్ రావు తెలిపారు.