calender_icon.png 14 September, 2025 | 2:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రేవంత్‌ను అరెస్ట్ చేయాలి

14-12-2024 01:06:21 AM

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, డిసెంబర్ 13 (విజయక్రాంతి): హైడ్రా సృష్టించిన భయాందోళనలతో ఇద్దరు అమాయకులు చనిపోయారని.. ఇందుకు కారణమైన సీఎం రేవంత్‌ను అరెస్ట్ చేయాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఎక్స్‌వేదికగా ఆయన స్పందిస్తూ.. జాతీయ అవార్డు గ్రహీత అల్లు అర్జున్ అరెస్ట్ పాలకుల అభద్రతకు పరాకాష్ట అని విమర్శించారు. 

తొక్కిసలాట బాధితులపై తనకు పూర్తిగా సానుభూతి ఉందని, ఆ ఘటనలో వాస్తవంగా విఫలమైంది ఎవరు? అని ప్రశ్నించారు. అల్లు అర్జున్‌కు నేరుగా ఎలాంటి సంబంధం లేని కేసులో ఆయనను ఒక సాధారణ నేరస్తుడిగా చూడటం సరికాదన్నారు. గౌరవప్రదమైన ప్రవర్తనకు ఎప్పుడూ స్థానం ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం వ్యవహరించిన తీరు సక్రమంగా లేదని మండిపడ్డారు.