17 April, 2026 | 9:39 PM

Breaking News

రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •   ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి ఈసీ సభ్యురాలుగా డాక్టర్ బి.సుజాత   •   కులగణన లెక్కలు పబ్లిక్ డొమైన్‌లోకి మల్లన్న నిరంతర పోరాట ఫలితం   •   ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి   •   నార్సింగిలో ఉద్యోగుల నిరసన.. తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పణ   •   రోడ్డు ప్రమాద సమయంలో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై అవగాహన   •  

29న తెలంగాణ నాయర్ సేవ సంఘం ఆవిర్భావం

28-06-2025 12:41 AM

తెలంగాణ నాయర్ సేవ సంఘం అధ్యక్షులు కె. సురేంద్రన్

ముషీరాబాద్, జూన్ 27 (విజయక్రాంతి): సామాజిక నిబద్ధతకు పర్యాయ పదంగా నాయర్ సేవ సొసైటీని తెలంగాణ రాష్ట్రంలో ప్రారంబించునున్నట్లు తెలంగాణ నాయర్ సేవ సొసైటీ అధ్యక్షులు కె. సురేంద్రన్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సొసైటీ ప్రధాన కార్యదర్శి ఏం.కె. శశి కుమార్, కోశాధికారి పి. సేతుమాధవాన్ తదితరులతో కలసి కె. సురేంద్రన్ తెలంగాణ నాయర్ సేవ సంఘం ఆవిర్భావ గోడ పత్రికను ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ నాయర్ సేవ సొసైటీ 100 సంవత్సరాల క్రితం ప్రముఖ సామజిక వేత్త మన్నతు పద్మనాభన్ స్థాపించారని, దేశం మొత్తం 8 వేల శాఖలతో సేవలందిస్తుందని చెప్పారు. ఈ నెల 29న హైదరాబాద్, కాప్రా లోని ఎర్ర లలిత ఫంక్షన్ హాల్ లో గోవా రాష్ట్ర గవర్నర్ పి.ఎస్. శ్రీధరన్ పిళ్ళై తెలంగాణ నాయర్ సేవ సొసైటీ ని ప్రారంభిస్తారని, లోక్ సభ సభ్యులు ఎన్.కె.ప్రేమచంద్రన్ తదితరులు గౌరవ అతిథులుగా పాల్గొంటారన్నారు.