30 June, 2026 | 7:54 PM

Breaking News

మాదక ద్రవ్యాలు అరికట్టేందుకు పలు దుకాణాల్లో డాగ్ స్క్వాడ్ తనిఖీలు   •   పౌర హక్కులకు భంగం కలిగిస్తే ఉపేక్షించేది లేదు   •   ఆర్టీసీ కార్గో సేవలు పునరుద్ధరించాలి   •   సిద్దాపూర్ రిజర్వాయర్ భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి   •   సుల్తానాబాద్ మున్సిపల్ ను అభివృద్ధి చేయడమే లక్ష్యం   •   చిన్న గాలి వానోస్తే కరెంటు గల్లంతే   •   మాదక ద్రవ్యాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి   •   రామేశ్వరపల్లిలో తెలంగాణ విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం ప్రారంభం   •   ప్రమాదవశాత్తు భవనం పైనుంచి కింద పడి యువకుడు మృతి   •   మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •  

ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోండి

28-06-2025 12:40 AM

తెలంగాణ రాష్ట్రం స్త్రీ నిధి అధ్యక్షురాలు గాలెంక ఇందిర

చండూరు,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో స్త్రీ నిది ద్వారా మహిళా సంఘ సభ్యులకు ఫైబర్ గ్రిడ్ కోసం రుణాలు రూ 4 లక్షలు నుంచి 5 లక్షల వరకు అందజేయడం జరుగుతుందని స్త్రీ నిధి తెలంగాణ రాష్ట్రం అధ్యక్షురాలు గాలెంక ఇందిర అన్నారు. శుక్రవారం నాంపల్లి మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఈ రుణాన్ని ఐదు సంవత్సరాలలో చెల్లించాలని, ఈ డబ్బులతో కేబుల్ రూటర్, వైఫై బాక్సులు కొనుగోలు చేసేలా ఏర్పాటు చేస్తున్నారని ఆమె అన్నారు.

ఆసక్తి ఉన్నవారికి కేబుల్ కలెక్షన్ ఇచ్చి నెల నెల డబ్బులు వసూలు చేసుకోవచ్చుని, దీని ద్వారా ఒక్కొక్క మహిళకు నెలకు రూ.15 వేలు కమిషన్ వస్తుందని ఆమె అన్నారు. ఇంటి పై కప్పు సోలార్ సిస్టం ఉపయోగించుకోవడం ద్వారా మహిళలు ఆర్థిక స్వలంబన పొందుతారని ఆమె అన్నారు. మహిళా సంఘ సభ్యులు ఇదివరకు తీసుకున్న స్త్రీ నిధి అప్పులు త్వరగా చెల్లించాలని, ప్రభుత్వం ఇచ్చే ఇన్సెంటివ్ ఆరులు అవుతారని అన్నరు . స్త్రీ నిధి ద్వారా మహిళా సంఘ సభ్యులు తీసుకున్న అప్పుకు ఇన్సూరెన్స్ ఉంటుందని ఆమె అన్నారు. గేదలు కొనుగోలు, ఆవులు కొనుగోలుకు, చార్జింగ్ ఆటోలు, నాటు కోళ్ల పెంపకంకు. రుణాలు అందజేస్తున్నమని వారు తెలిపారు.