5 August, 2026 | 3:12 PM

Any Emergency Dial-112: అత్యవసర సేవలకు ఇకపై ఒకే నంబర్

05-08-2026 02:07 PM

డయల్ 112 సేవలు ప్రారంభం

డయల్ 112 ద్వారా అందుబాటులోకి 18 రకాల సేవలు

డయల్ 112 సేవలను ప్రారంభించిన డీజీపీ సీవీ ఆనంద్

హైదరాబాద్: కమాండ్ కంట్రోల్ సెంటర్(Command Control Center) నుంచి డయల్ 112 సేవల సేవలను తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్(Telangana DGP CV Anand) ప్రారంభించారు. డీజీపీ ఆనంద్, ఉన్నతాధికారులు డయల్ 112 సేవల పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి డీజీలు విక్రమ్ సింగ్, శ్రీనివాస్, కమల్ హాసన్ రెడ్డి, సీపీలు రమేశ్ రెడ్డి, సుమతి, సజ్జనార్, సీఐడీ చీఫ్ చారు సిన్హా, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ షికా గోయాల్  హాజరయ్యారు.  డయల్ 112 ద్వారా 18 రకాల సేవలు అందుబాటులోకి వచ్చాయి.

పోలీసు, అగ్నిమాపక, వైద్య సేవలు, మహిళల రక్షణ, చైల్డ్ వెల్ఫేర్, హైడ్రా, జీహెచ్ఎంసీ, ఒకే గొడుకు కిందకు వచ్చాయి. అత్యవసర సమయాల్లో అండగా ఉండేందుకు 112 సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. 24 గంటలు , 365 రోజులు అత్యవసర సేవలు అందుబాటులో ఉంటాయని సీవీ ఆనంద్ సూచించారు. ప్రమాదాలు, నేరాలు, వైద్య సేవలకు తక్షణ సాయం అందుతోందన్నారు. ప్రజల భద్రత, అత్యవసర స్పందన సామార్థ్యాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యమని ఆనంద్ వెల్లడించారు.