పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులకు సన్మానం
విద్యార్థుల భవిష్యత్తుకు పునాది వేసిన గురువుల సేవలు చిరస్మరణీయం
మంథని,(విజయక్రాంతి): ఇటీవల పదవీ విరమణ పొందిన విశ్రాంత ఉపాధ్యాయులు బిరుదు మధు, బోనాల రవీందర్లను మంథని పట్టణంలోని పెంజెరుట్ట కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సన్మానించారు. లోకే మనోహర్, టేక్కేగారి రాధాకృష్ణన్‌లు శాలువాలు కప్పి వారిని ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ, దశాబ్దాల పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి, వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసిన ఉపాధ్యాయుల సేవలు సమాజానికి ఆదర్శమని కొనియాడారు. విద్యార్థుల్లో విలువలు, క్రమశిక్షణ పెంపొందించడంలో వారి పాత్ర విశేషమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది కేతిరెడ్డి రఘోతం రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గోటికార్ కిషన్ జీ, మంథని రమేష్, రాంపల్లి లక్ష్మణ్, పల్లి మధుసూదన్‌తో పాటు పలువురు ప్రముఖులు, విద్యావేత్తలు, స్థానికులు పాల్గొని విశ్రాంత ఉపాధ్యాయులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.






