calender_icon.png 8 December, 2025 | 12:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ప్రత్యేకతలివే

08-12-2025 09:42:14 AM

 రెండ్రోజుల సదస్సు.. తెలంగాణ భవిష్యత్ రూపకల్పన

హైదరాబాద్: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్(Telangana Rising Global Summit) జరిగే ప్రాంతంలో భారీ సెమినార్ హాళ్లు ఏర్పాట్లు చేశారు. రెండ్రోజుల సదస్సులో తెలంగాణ భవిష్యత్ రూపకల్పనపై కీలక చర్చలు జరగనున్నాయి. సమ్మిట్ లో రూ. లక్ష కోట్లకుపైగా పెట్టుబడుల ఒప్పందాలు జరిగే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ కార్యాచరణ ప్రణాళికపై చర్చించనున్నారు. ప్రణాళికలపై పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల నిష్ణాతులతో చర్చాగోష్టి నిర్వహించనున్నారు. 

కాలుష్య రహిత(నెట్ జీరో), సెమీకండక్టర్ల పరిశ్రమ, కృత్రిమ మేధ, మానవవనరుల అభివృద్ధి, మహిళల ఆర్థికాభివృద్ధి, క్రీడాభివృద్ధి, వ్యవసాయాధారిత ప్రరిశ్రమ వృద్ధి, సంబంధిత అంశాలపై గ్లోబల్ సదస్సులో చర్చించనున్నారు. రైజింగ్ సమ్మిట్ సంస్కృతిక, కళలు ప్రతిబింబించేలా కార్యక్రమాలు, విభిన్న కళారూపాలతో సమ్మిట్ కు వచ్చే అతిథులకు ఆత్మయ ఆహ్వానం లభించనుంది. భిన్న సాంస్కృతిక, కళారుపాలు అతిథులను అలరించనున్నాయి. తెలంగాణ రైజింగ్ సమ్మిట్ లో ఎంఎం కీరవాణి 90 నిమిషాల కచేరి చేయనున్నారు. ప్రముఖ విద్యాంసురాలు పి. జయలక్ష్మి వీణావాయిద్యం, సమ్మిట్ లో భాగంగా కళా కృష్ణ ఆధ్వర్యంలో పేరిట నాట్యం, ఇంద్రజాలికుడు సామల వేణు ప్రదర్శన, కొమ్ముకోయ, బంజారా, కోలాటం, గుస్సాడి, ఒగ్గుడోలు, పేరిణి నృత్యం వంటి ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.

రెండు రోజుల తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 డిసెంబర్ 8న మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 12:30 గంటలకు ఫ్యూచర్ సిటీకి చేరుకుంటారు. ముందుగా ఆయన సమ్మిట్ వేదిక వద్ద ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శించి పరిశీలిస్తారు. ప్రారంభోత్సవం మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది, గవర్నర్ డాక్టర్ జిష్ణు దేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ప్రారంభోపన్యాసం సందర్భంగా, ముఖ్యమంత్రి తెలంగాణ ఉజ్వల భవిష్యత్తు కోసం ఆవిష్కరిస్తున్న భవిష్యత్ అభివృద్ధి రోడ్‌మ్యాప్‌తో పాటు, ప్రజా పాలన నమూనా కింద ప్రభుత్వం రెండేళ్లలో సాధించిన విజయాలను వివరిస్తారు. రేపు తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్కుమెంట్ ను రాష్ట్రప్రభుత్వం విడుదల చేయనుంది.