08-12-2025 09:19:04 AM
హైదరాబాద్: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్(Telangana Rising Global Summit)కు హైదరాబాద్ ముస్తాబైంది. ఫ్యూచర్ సిటీలో నేడు, రేపు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. సంప్రదాయ, సాంకేతిక హంగులతో సమ్మిట్ ప్రాంగణం ముస్తాబైంది. దేశ, విదేశీ ప్రతినిధులను ఆకట్టుకునేలా హైదరాబాద్ సిద్ధం చేశారు. అందరి దృష్టినీ తెలంగాణ ఆకర్మించాలనే లక్ష్యంతో ఏర్పాట్లు చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీ వరకు ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నలువైపులా గ్లోబల్ సమ్మిట్ లోగోలతో 1500 జెండాలు కట్టారు.
హైదరాబాద్ లో 10 చోట్ల ప్రత్యేక సమాచార స్టాళ్లు ఏర్పాటు చేశారు. ఫ్యూచర్ సిటీలో ప్రత్యేక ఆకర్షణగా డిజిటల్ తెరలతో టెన్నల్ నిర్మించారు. త్రీడీ డిజైన్లతో 50 మీటర్ల టన్నెల్ నుంచి సమ్మిట్ కు చేరేలా ఏర్పాట్లు చేశారు. నగరంలోని ప్రముఖ ప్రాంతాల్లో హైటెక్ ప్రొజెక్షన్, డిజిటల్ ప్రదర్శనలు చేశారు. అతిథులకు తెలంగాణ సాంస్కృతిక వైభవం తెలిసేలా సిద్ధం చేశారు. తెలంగాణ సచివాలయం వద్ద త్రీడీ ప్రొజెక్షన్ మ్యాపింగ్(3D projection mapping) ఏర్పాటు చేశారు. రాష్ట్రాభివృద్ధి తీరు, భవిష్యత్ లక్ష్యాలు వివరించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. తెలంగాణ రైజింగ్ -2047 లక్ష్యాలు అర్థమయ్యేలా డిస్ ప్లేలు సెట్ చేశారు. హుస్సేన్ సాగర్ లో వాటర్ ప్రొజెక్షన్ ద్వారా ప్రత్యేక ప్రదర్శన, చార్మినార్, కాచిగూడ రైల్వే స్టేషన్ భవనంపై(Kacheguda Railway Station Building) లైటింగ్ ప్రొజెక్షన్, దుర్గం చెరువలో గ్లోబ్ ఆకారంలో తెలియాడే ప్రొజెక్షన్ సిద్ధం చేశారు.