తెలంగాణ షాడో సీఎం మీనాక్షి నటరాజన్!
బీజేపీ రాష్ర్ట ప్రధాన అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్
హైదరాబాద్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): రాష్ట్రానికి సీఎం రేవంత్ రెడ్డి నామమాత్రపు ముఖ్యమంత్రిగా మాత్రమే కనపడుతున్నారని.. తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ షాడో సీఎంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ ఆరోపించారు.
ప్రభుత్వాన్ని గాంధీభవన్ నుంచి నడిపిస్తున్నట్టుగా కనిపిస్తోందని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం రేవంత్‌కు పాలనపై పట్టు రాలేదని, రాష్ట్రంలో షాడో సీఎం పాలన దేనికి సంకేతమని ప్రశ్నించారు. ప్రభుత్వ హోదా లేని మీనాక్షి నటరాజన్ సచివాలయంలో మంత్రులు, అధికారులు పాల్గొన్న అధికారిక సమీక్షలో పాల్గొనడం రాజ్యాంగ విరుద్ధమన్నారు.
సన్నబియ్యంపై సమీక్షకు వెళ్లిన అధికారు లు, లబ్ధిదారుల ఇళ్లలోకి వెళ్లి సన్నబియ్యం తినకుం డా రొట్టెలు తిం టుంటే.. మంత్రులేమో సన్నబియ్యం బాగుందని చెప్పడం విడ్డూరమన్నారు. కంచ -గచ్చిబౌలిలో చెట్లు నరికి ప్రజలదే తప్పని ఎలా అంటారని సుభాష్ ప్రశ్నించారు.
దీనిపై ప్రజలు ప్రశ్ని స్తే.. ఏఐ ఫొటోల పేరిట తప్పించుకునే ప్ర యత్నం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఖమ్మం, నల్లగొండ నేతలు గ్రూపులుగా త యారై ప్రభుత్వంలో తమ ప్రభావం కోసం పాకులాడుతున్నారని.. వారిని నిలువరించడంతోనే సీఎంకు సరిపోతుందని పాలన ఎప్పుడు చేస్తారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి మార్క్ పాలన కేవలం అబద్ధపు హామీలకే పరిమితమైందన్నారు.






