calender_icon.png 4 June, 2025 | 4:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం

02-06-2025 10:29:23 PM

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ(Telangana State Formation Day) సందర్భంగా జిల్లా కోర్టు ప్రాంగణంలో అవతరణ దినోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. సోమవారం జిల్లా ప్రధాన కోర్టుపై మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి కళ్యాణ్ చక్రవర్తి జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు న్యాయశాఖ సిబ్బంది పోలీసులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం న్యాయవాదుల సంఘం భవనంపై న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు అనంతరెడ్డి జాతీయ జెండాను ఎగరవేశారు ప్రొఫెసర్ జయశంకర్ భరతమాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి నివాది శ్రీధర్ రావు, కోశాధికారి వెంకట్రావు, ఉపాధ్యక్షుడు వెంకటయ్య, ఇతర కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.