17 April, 2026 | 11:18 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

02-06-2025 05:56 PM

మహదేవపూర్/భూపాలపల్లి (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అక్బర్ ఖాన్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ(Telangana State Formation Day) వేడుకల్లో జెండా ఆవిష్కరించారు. అక్బర్ ఖాన్ మాట్లాడుతూ... ప్రజలంతా కలిసికట్టుగా పోరాడి సాధించుకున్న రాష్ట్రం 11 ఏళ్లు పూర్తి చేసుకుని 12వ సంవత్సరంలోకి అడుగు పెడుతుందని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాధన పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను స్మరించుకున్నారు.

సంవత్సరాలకు సంవత్సరాలుగా సాగిన తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న కవులు, కళాకారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, మేధావులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, కార్మికులు, కర్షకులు, మహిళలు, రాజకీయ పార్టీల నాయకులందరికీ అభినందనలు తెలిపారు. అనంతరం తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా మా ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ నినాదంతో రాష్ట్ర ఆర్ధిక అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని అన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచేలా సరికొత్త విధానాలతో భవిష్యత్తు ప్రణాళికలు రూపొందిస్తుదని అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ తిరుపతిరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి విలాస్ రావు, మాజీ ఎంపీపీ రాణి బాయి, మాజీ ఎంపిటిసి ఆకుతోట సుధాకర్, గుడాల శ్రీనివాస్, మైనార్టీ అధ్యక్షుడు ఎజాస్, కటకం అశోక్, కుంభం పద్మ, వామన్ రావు, అయిత తిరుపతిరెడ్డి, శంకరయ్య, కోట సమ్మయ్య, దాహగం సంతోష్, బుర్రి శివారాజు, నయన్ మండల కాంగ్రెస్ నాయకులు జిల్లా కాంగ్రెస్ నాయకులు మహిళలు యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.