27 June, 2026 | 2:03 PM

తెలంగాణ ఆవిర్భావ వేడుకలు..

02-06-2025 05:59 PM

100 రోజుల ప్రణాళిక ర్యాలీ..

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ(Telangana State Formation Day) వేడుకలను పురస్కరించుకొని సోమవారం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 100 రోజుల ప్రణాళిక ర్యాలీ నిర్వహించారు. తొలుత మున్సిపల్ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరుపుకున్నారు. అనంతరం 100 రోజుల ప్రణాళిక ర్యాలీ చేపట్టారు. పురపాలక సంఘం నుంచి మొదలైన ఈ ర్యాలీ బజార్ ఏరియా అంబేద్కర్ కంటా చౌరస్తా వరకు చేపట్టారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి కమిషనర్ శ్రీనివాసరావు, మేనేజర్ మజర్ ఆఫీస్ సిబ్బంది, మెప్మా సిబ్బంది టీఎంసీ దుర్గయ్య సి ఓ కిషోర్, ఆర్ పీ ఎస్ లు  అరుణ, రజిత, అంగన్వాడి టీచర్స్, ఆశ వర్కర్స్ పాల్గొన్నారు.