30-05-2025 12:12:46 PM
హైదరాబాద్: గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులను శుక్రవారం ప్రకటించారు. 2014 నుంచి 2023 వరకు గద్దర్(Gaddar Film Awards) సినీ అవార్డులను హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో కలిసి మురళీమోహన్(Murali Mohan) వెల్లడించారు. 2014 నుంచి 2023 సంవత్సరం వరకు ఉత్తమ చిత్రాలను ప్రకటించారు. సినీ అవార్డులు ఇవ్వడం లేదని చాలామంది బాధపడ్డారని మురళీ మోహన్ తెలిపారు. సినీ కళాకారులు అవార్డులు ఆశించడం సహజం అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చాక అవార్డులపై చొరవ తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు.
2014 నుంచి 2023 వరకు ఏడాదికి ఒక ఉత్తమ చిత్రానికి పురస్కారాన్ని ప్రకటించిన తెలంగాణ సర్కార్
2014 సంవత్సరానికి ఉత్తమ తొలి చిత్రం రన్ రాజా రన్
2015 సంవత్సరానికి ఉత్తమ తొలి చిత్రం రుద్రమదేవి
2016 సంవత్సరానికి ఉత్తమ తొలి చిత్రం శతమానం భవతి
2017 సంవత్సరానికి ఉత్తమ తొలి చిత్రం బాహుబలి-2
2018 సంవత్సరానికి ఉత్తమ తొలి చిత్రం మహానటి
2019 సంవత్సరానికి ఉత్తమ తొలి చిత్రం మహర్షి
2020 సంవత్సరానికి ఉత్తమ తొలి చిత్రం అల వైకుంఠపురంలో
2021 సంవత్సరానికి ఉత్తమ తొలి చిత్రం ఆర్ఆర్ఆర్
2022 సంవత్సరానికి ఉత్తమ తొలి చిత్రం సీతారామం
2023 సంవత్సరానికి ఉత్తమ తొలి చిత్రం బలగం
స్పెషల్ జ్యూరీ అవార్డు - ప్రజాకవి కాళోజీ
బాలకృష్ణకు ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డు
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డులు
విజయ్ దేవరకొండకు కాంతారావు అవార్డు
మణిరత్నంకు పైడి జయరాజ్ ఫిలిం అవార్డు
అట్లూరి పూర్ణచంద్రరావుకు నాగిరెడ్డి అండ్ చక్రపాణి ఫిలిం అవార్డు
సుకుమార్‌కు బీఎన్ రెడ్డి ఫిలిం అవార్డు