calender_icon.png 2 June, 2025 | 7:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

8 వసంతాలు వచ్చేది అప్పుడే

30-05-2025 12:00:00 AM

అనంతిక సనీల్‌కుమార్ లీడ్ రోల్ పోషించిన చిత్రం ‘8 వసంతాలు’. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించిన ఈ మూవీని నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. మేకర్స్ తాజాగా చిత్రం విడుదల తేదీని ప్రకటించారు. జూన్ 20న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో చీరకట్టులో, కొప్పులో గులాబీ పెట్టుకొని ఉన్న కథానాయిక అనంతిక సనీల్‌కుమార్ లుక్ ఆకట్టుకుం టోంది. హనురెడ్డి, రవితేజ దుగ్గిరాల, సంజన, కన్నా, స్వరాజ్ రెబ్బా ప్రగడ, సమీరా కిషోర్ ఇతర కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్; డీవోపీ: విశ్వనాథ్‌రెడ్డి.