1 September, 2026 | 9:25 PM

తైక్వాండోలో గిన్నిస్ వరల్డ్ రికార్డుతో మెరిసిన అనురాగ్ విద్యార్థి

01-09-2026 | 08:37pm

ఘట్ కేసర్,(విజయక్రాంతి): అనురాగ్ యూనివర్సిటీకి(Anurag University) చెందిన బీటెక్ 3వ సంవత్సరం ఏఐఎంఎల్ విద్యార్థి(AIML student) మహమ్మద్ అబ్రార్ అన్సార్ (24EG107H65) తైక్వాండోలో విశేష ప్రతిభ కనబరిచారు. 1,212 మంది పాల్గొన్న అతిపెద్ద కరాటే ప్రదర్శనలో గిన్నిస్ వరల్డ్ రికార్డు(Guinness World Record) సాధించారు. 30 నిమిషాల్లో 11,475 తైక్వాండో కిక్స్‌తో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోనూ(Limca Book of Records) స్థానం సంపాదించారు. ఓపెన్ నేషనల్‌లో స్వర్ణ పతకం, ఓపెన్ ఇంటర్నేషనల్‌లో రజత పతకం సాధించారు. 7 ఏళ్ల సాధనతో బ్లాక్ బెల్ట్ (1వ డాన్) పొందారు. అబ్రార్ అన్సార్ మాదిరిగానే ఏఐఎంఎల్ విభాగంలోని ఇతర విద్యార్థులు కూడా తమ లక్ష్యాలను సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నాం అని ఏఐఎంఎల్ విభాగాధిపతి డాక్టర్ ఎ. మల్లికార్జునరెడ్డి తెలిపారు.