calender_icon.png 12 November, 2025 | 3:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అబుదాబీలో ఐపీఎల్ మినీ వేలం

12-11-2025 12:00:00 AM

ముంబై, నవంబర్ 11: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌కు ముందు జరిగే ఆటగాళ్ల వేలానికి అబుదాబీ ఆతిథ్యమిచ్చే అవకాశాలున్నాయి. డిసెంబర్ 14 నుంచి 17 మధ్య వేలాన్ని నిర్వహిస్తారని వార్తలు వస్తుండగా విదేశీ వేదికపైనే బీసీసీఐ ఆసక్తి చూపు తున్నట్టు తెలుస్తోంది. గత రెండు సార్లూ ఐపీఎల్ వేలం దుబాయి(2023), జెడ్డా (2024) విదేశాల్లోనే నిర్వహించారు. దీంతో ఈ సారి స్వదేశంలో నిర్వహిస్తారని అంతా భావించారు.

అయితే లాజిస్టిక్ కారణాలతో అబుదాబీలో ఆక్షన్‌ను ఏర్పాటు చేసేందుకు బీసీసీఐ రెడీ అవుతోంది. బ్రాడ్‌కాస్టర్లు, యాషెస్ సిరీస్‌తో బిజీగా ఉండడం, అలాగే పలు ఫ్రాంచైజీలకు చెందిన విదేశీ కోచ్ లు,మెంటార్‌లకు సౌకర్యంగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీని పై బీసీసీఐ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. తేదీ ఖరారైన తర్వాత ఒకేసారి అనౌ న్స్‌మెంట్ ఉంటుందని భావిస్తున్నారు. కాగా మినీ వేలం కోసం నవంబర్ 15వ తేదీ లోపే అన్ని ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాలను ప్రకటించాల్సి ఉంది. ఈ లోపే ట్రేడింగ్ విండోను కూడా పూర్తి చేసుకోవాలి.ఇప్పటికే ఫ్రాంచైజీలన్నీ తమ తమ రిలీజ్ ప్లేయర్స్ జాబితాపై క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తోంది. నవంబర్ 15న అన్ని ఫ్రాంచైజీలు తమ జాబితాలను విడుదల చేయనున్నాయి.