calender_icon.png 2 February, 2026 | 1:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ ఎంపీటీసీని పరామర్శించిన ఎమ్మెల్యే గంగుల

02-02-2026 12:24:52 AM

కరీంనగర్, ఫిబ్రవరి 1 (విజయ క్రాంతి): మాజీ ఎంపీటీసీ, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గంగాధర లక్ష్మయ్య 16వ డివిజన్లో బిఆర్‌ఎస్ పార్టీ తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొని తిరిగి వస్తూ ప్రమాదానికి గురికాగా... వెంటనే సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే గంగుల ఆస్పత్రిలో చేర్పించి చికిత్సను అందించారు. ఆదివారం ఆస్పత్రికి వెళ్లి పరామర్శించి, వైద్యులను పరిస్థితి అ డిగి తెలుసుకున్నారు. రెండు మూడు రోజుల్లో రికవరీ కానున్నారని వైద్యులు తెలిపారు.

పార్టీ నాయకులకు ఏదైనా సమస్య వచ్చిన అన్ని విధాలుగా అండగా ఉంటామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ భరోసా ఇచ్చారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, బి ఆర్ ఎ స్ నగర అధ్యక్షులు చల్ల హరి శంకర్, మాజీ కార్పొరేటర్లు వంగపల్లి రాజేందర్రావు, మాజీ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ కర్ర సూర్య శేఖర్, నాయకులు మిడిదొడ్డి నవీన్, లక్ష్మయ్య కుమారుడు బిఆర్‌ఎస్ పార్టీ కరీంనగర్ నియోజకవర్గ యూత్ ప్రధాన కార్యదర్శి గంగాధర చందు లు ఉన్నారు.