తెలుగు ఫిల్మ్ డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదం
12-07-2026 04:21 PM
హైదరాబాద్: తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ లో వివాదం రేగింది. డ్యాన్సర్ అసోసియేషన్ అధ్యక్షురాలు, కొరియోగ్రాఫర్ జానీ మాస్లర్ భార్య సుమలత (అయేషా) ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మిగతా డ్యాన్సర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమలత తీరుకు నిరసనగా అసోసియేషన్ కు 10 మంది డ్యాన్సర్లు రాజీనామా చేశారు. ఫెడరేషన్ అనుమతి లేకుండా బై ఎలక్షన్ నిర్వహించేందుకు ఆమె సిద్ధమవడంతో ఈ వివాదం రేగినట్లు సమాచారం.






