27 August, 2026 | 10:57 PM

సోదర భావానికి ప్రతీక రాఖీ పండుగ

27-08-2026 08:34 PM

- రాష్ట్ర ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు

ములుగు,(విజయ క్రాంతి): రాఖీ పండుగ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, అదనపు కలెక్టర్లు సీహెచ్ మహేందర్, జి. సంపత్ రావులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. గురువారం ములుగులోని నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో రాఖీ పండుగను పురస్కరించుకొని  ముందస్తుగా  మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లకు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క రాష్ట్ర ప్రజలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సోదరసోదరీమణుల మధ్య ప్రేమానురాగాలు, అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను ప్రతి కుటుంబం ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.