ఎంజిఎం హైస్కూల్‌లో ఘనంగా రాఖీ వేడుకలు
27-08-2026 08:40 PM
గణపురం,(విజయక్రాంతి): మండలంలోని చెల్పూర్ గ్రామంలోని ఎంజిఎం హైస్కూల్‌లో రాఖీ పౌర్ణమి వేడుకలను గురువారం ముందస్తుగా ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు పరస్పరం రాఖీలు కట్టుకుని అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల ఆత్మీయ అనుబంధాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ గ్యాదంగి సతీష్ మాట్లాడుతూ రాఖీ పండుగ సోదర సోదరీమణుల మధ్య ప్రేమ, అనురాగాలకు ప్రతీక అని తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్లు గ్యాదంగి తిరుపతి, గ్యాదంగి రమాదేవి, సిల్వేరి శ్రీనివాస్, ప్రిన్సిపాల్ మధూకర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.






