calender_icon.png 11 November, 2025 | 8:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలుగు టైటాన్స్ విజయం

15-12-2024 12:14:21 AM

పుణే: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్‌లో తెలుగు టైటాన్స్ రెండు పరాజయాల తర్వాత గెలుపు బాట పట్టింది. శనివారం పుణే వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 36 గుజరాత్ జెయింట్స్‌పై విజయాన్ని నమోదు చేసుకుంది.

టైటాన్స్ తరఫున కెప్టెన్ పవన్ షెరావత్ (12 పాయింట్లు) సూపర్ టెన్‌తో మెరిసి విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ విజయంతో టైటాన్స్ పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంది. మరో మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ 44 హర్యానా స్టీలర్స్‌పై గెలుపొందింది.  మ్యాచ్‌లో ఓటమి పాలైన హర్యానా స్టీలర్స్ ఇప్పటికే ప్లేఆఫ్స్ చేరిన సంగతి తెలిసిందే.