15-12-2024 12:17:20 AM
సెమీస్‌లో జపాన్‌పై విజయం
మస్కట్: మహిళల జూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఫైనల్లో అడుగుపెట్టింది. శనివారం మస్కట్ వేదికగా జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్ 3 జపాన్‌ను ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. యంగ్ ఇండియా తరఫున ముంతాజ్ ఖాన్ (ఆట 4వ నిమిషంలో), సాక్షి రానా (5వ ని.లో), దీపికా (13వ ని.లో) గోల్స్ చేశారు. నికో మరుయమా (23వ ని.లో) జపాన్‌కు ఏకైక గోల్ అందించింది. నేడు జరగనున్న టైటిల్ ఫైట్‌లో చైనాతో భారత్ తలపడనుంది.