14-12-2024 11:33:57 PM
మూడో వన్డేలో పాక్ ఓటమి...
సెంచూరియన్: స్వదేశంలో పాకిస్థాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సౌతాఫ్రికా 2 సొంతం చేసుకుంది. శుక్రవారం అర్థరాత్రి జరిగిన రెండో టీ20లో సఫారీలు 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. సయీమ్ ఆయుబ్ (57 బంతుల్లో 98 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో అలరించగా.. బాబర్ ఆజం (31), ఇర్ఫాన్ ఖాన్ (30) ధాటిగా ఆడారు. సఫారీ బౌలర్లలో గాలియమ్, బార్త్‌మన్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం సౌతాఫ్రికా 19.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసి విజయతీరాలకు చేరింది. రీజా హెండ్రిక్స్ (63 బంతుల్లో 117) సెంచరీతో మెరవగా.. డుసెన్ (38 బంతుల్లో 66 నాటౌట్) ధాటిగా ఆడి జట్టును గెలిపించాడు. పాక్ బౌలర్లలో జహన్‌దద్ ఖాన్ 2 వికెట్లు తీశాడు. నేడు మూడో టీ20 మ్యాచ్ జరగనుంది.