27 August, 2026 | 10:53 AM

దేవాలయం నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం

04-05-2026 07:44 PM

మఠంపల్లి,(విజయక్రాంతి): మఠంపల్లి మండలంలోని చౌటపల్లి గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం నూతన పాలకవర్గం దేవాదాయ శాఖ అధికారులచే దేవాలయ ప్రాంగణంలో సోమవారం ప్రమాణ స్వీకారం నిర్వహించారు. అనంతరం చైర్మన్ గా సింగవరపు సైదులు, పాలకవర్గంను ఏకగ్రీవంగా ఎన్నికున్నారు. అర్చకులు స్వామి వారికి ప్రత్యేక పూజలు అష్టోత్తరము నిర్వహించి తీర్థ ప్రసాదములు అందించారు. అనంతరం పాలకవర్గాన్ని ఘనంగా సన్మానించారు.