calender_icon.png 11 February, 2026 | 4:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్న ప్రసాదం కోసం టెండర్లు

11-02-2026 02:07:48 AM

ఈ నెల 15 నుంచి స్వయంభు లింగేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో స్వీకరణ

మేళ్లచెరువు, ఫిబ్రవరి 10(విజయక్రాంతి): ఈనెల 15 నుంచి 19వ తేదీ వరకు మేళ్ల చెరువులోని శ్రీస్వయంభు శంభు లింగేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా, ఐదు రోజులు జాతరకు వచ్చే భక్తులకు అన్న ప్రసాదం ఏర్పాటు చేయుటకు ఆసక్తి ఉన్నవారు టెండర్లు వేయాలని ఆలయ కార్య నిర్వహణ అధికారి ఎన్ శంబిరెడ్డి తెలిపారు.

11వ తేదీన దేవస్థానం ప్రాంగణం నందు షెడ్యూలు పొందాలని,12వ తేదీ టెండర్ షెడ్యూలు సమర్పించాలని, అదే రోజు సాయంత్రం సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో టెండర్ బాక్స్ ఓపెన్ చేసి, టెండర్ దారుని ఎన్నిక చేస్తారని ఆయన అన్నారు. దీనికిగాను మూడు లక్షలు డిపాజిట్ ఉంటుందని తెలిపారు.