calender_icon.png 25 November, 2025 | 3:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖమ్మం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత

25-11-2025 02:28:09 PM

హైదరాబాద్: ఖమ్మం కలెక్టరేట్(Khammam Collectorate) వద్ద మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. చింతకాని మండలం పాతర్లపాడు గ్రామానికి చెందిన భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ సామినేని రామారావు(Samineni Rama Rao) హత్యకు నిరసనగా కలెక్టరేట్ ముట్టడించారు. నిరసనల్లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ(CPM State Secretary John Wesley) పాల్గొన్నారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు సీపీఎం మధ్య లోపులాట జరిగింది. సామినేని రామారావు  హ‌త్య ఖమ్మం జిల్లాలో కలకలం రేపిన విషయం తెలిసిందే. తెలంగాణ ఉప ముఖ్యముఖ్యమత్రి భ‌ట్టి విక్రమార్క ఇలాకాలో హ‌త్యా రాజ‌కీయం భ‌గ్గుమ‌ంది. దుండ‌గులు క‌త్తుల‌తో  సామినేని రామారావు గొంతు కోసి దారుణంగా హతమార్చారు. సామినేని రామారావును కాంగ్రెస్ నేత‌లే హత్య చేయించారని సీపీఎం నేత‌లు అనుమానం వ్యక్తం చేశారు.