12 March, 2026 | 10:47 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

మిట్టపల్లిలో ఉద్రిక్తత

17-12-2025 06:28 PM

జైపూర్, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గం జైపూర్ మండలంలోని మిట్టపల్లి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగగా, మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభించాల్సిన కౌంటింగ్ ప్రక్రియను అధికారులు కావాలని ఆలస్యం చేశారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పోలింగ్ కేంద్రం ఎదుట బైఠాయించి నిరసనకు దిగారు.

ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ కౌంటింగ్ జాప్యంతో పాటు బ్యాలెట్ బాక్సులను మార్చే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. చెన్నూర్ నియోజకవర్గంలో మంత్రి వివేక్ వెంకట స్వామి అరాచకమైన రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. అదే సమయంలో కాంగ్రెస్ నాయకులు సైతం ప్రత్యారోపణలకు దిగారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు పరస్పరం పోటాపోటీగా నినాదాలు చేయడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు పరిస్థితి చేయిదాటకుండా ఉండేందుకు పోలింగ్ కేంద్రం పరిసరాల్లో భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. దీనిపై అధికారుల నుంచి ఇంకా స్పష్టమైన ప్రకటన రావాల్సి ఉంది.